
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్ట్24,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం నేతన్న యాత్రలో భాగంగా పుట్టపాక గ్రామంలో అఖిల భారత పద్మశాలి రాజకీయ విభాగం అధ్యక్షులు శివశంకర్ నేత,ఆధ్వర్యంలో నేడు నేతన్నలతో చేనేత సమస్యల పరిష్కారానికి తగు సూచనలు సలహాలు కొరకు,చేనేత వస్త్రాలను మార్కెటింగ్ ప్రచారం చేయుటకు జరిగే కార్యక్రమం హ్యాండ్లూమ్ క్లస్టర్ పుట్టపాక వద్ద నిర్వహించబడుచున్నది.ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత సాంప్రదాయ వస్త్రాల వినియోగాన్ని పెంచడం.చేనేత వస్త్రాలపై జీరో జీఎస్టీ గురించి,చేనేత కళాకారుల ఆర్థిక,సామాజిక,రాజకీయ విభాగాలలో ఉన్నతంగా వృద్ధి చెందుట కొరకు,చేనేత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం,చేనేత వస్త్రాలను ధరించి,ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచుటకు ఉపయోగపడే విధంగా,సంక్షేమ పథకాల అమలు కొరకు జరుగుచున్నది.ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి,కార్యవర్గం అఖిలభారత పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షులు శ్రీమతి వనం దుష్యంతులు,తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు,స్టేట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సమత,తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు.
పుట్టపాక లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం లో చర్చించే విషయాలను చేనేత వస్త్రాలను ప్రచారం చేయుటకు ఫ్యాషన్ షో ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేయుటకు వివిధ మీడియా ఛానల్ వారు హాజరవుతున్నారు.కావున పద్మశాలి చేనేత కార్మికులందరూ ఈ యొక్క కార్యక్రమానికి రావాలని తెలియజేశారు.



