గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 24
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చౌడేపల్లి మండలం మాజీ జడ్పిటిసి దివంగత గువ్వల రామకృష్ణారెడ్డి అజాతశత్రువుగా చరిత్రకు ఎక్కారని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు ఆదివారం గువ్వల రామకృష్ణారెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని గడ్డంవారిపల్లి పంచాయతీ తెల్ల నీళ్లపల్లిలో ఆయన నివాసం నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత రామకృష్ణారెడ్డి ఘాట్ వద్ద పూలమాలతో నివాళులు అర్పించారు అనంతరం ఇంటి వద్ద అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు దివంగత గువ్వల రామకృష్ణారెడ్డి మనసున్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు అన్నారు తెలుగుదేశం పార్టీ మండలంలో వికసించడానికి కృషి చేశారని నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ నాయకులను కార్యకర్తలను ఆదుకునే దిశగా అనేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు అనంతరం దివంగత రామకృష్ణారెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి ఆవుల రామచంద్రయ్య శ్రీధర్ రాజు (గిరి) అర్జున్ రాయల్ అనూస్ రాయల్ మని సింగ్ కుమార్ రెడ్డి పంజాని పల్లి బాబు చారాల విజయభాస్కర్ రెడ్డి గడ్డం వారి పల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ ముని వెంకటప్ప ఆవుల పవన్ కుమార్ బోయకొండ సుబ్బు సోము రెడ్డి గిరి నాయుడు సోషియల్ మీడియా కళ్యాణ్ జంగాలపల్లి ముని మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు






