
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు26,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర దేవాలయ దగ్గర సహస్ర వేదిక్ సేవా సమితి ఆధ్వర్యంలో కళ్లెం విజయ్ రెడ్డి,సహకారంతో మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సహస్ర వేదిక్ సేవా సమితి ముఖ్యులు కోగూరి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మండల కేంద్రంలోని ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని అందరూ ఈ మట్టి వినాయకుని భక్తి ప్రవృత్తులతో పూజించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కల్లెట్ల అరుణ్ సాగర్,పగిడిమర్రి కార్తీక్ ఏలే వెంకటేష్,గొల్లూరు యాదగిరి,రాసాల యాదయ్య,ఊషయ్య,రాజు,గంట రమేష్,ఓంకార్, జగన్నాథం,పాలకూర్ల శ్రీనివాస్,చిన్న రాజయ్య,పాఠశాల విద్యార్థులు గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.



