సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్టు30,(గరుడ న్యూస్):


యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ అనారోగ్య కారణాలవల్ల మతిస్థిమితం కోల్పోయాడు.అతను తీవ్ర ఆకలితో బాధపడడాన్ని చూసిన రహీం షరీఫ్,మానవత దృక్పథంతో వెంటనే భోజనాన్ని తీసుకువచ్చి అతనికి వడ్డించాడు.ఈ విషయాన్ని చూసిన గ్రామ ప్రజలు అతని యొక్క గొప్ప సేవ తత్వాన్ని అభినందించారు.అంతేకాకుండా రహీం షరీఫ్ గ్రామంలోని వృద్ధులకు చేతి కర్రలను,దుప్పట్లను,వికలాంగులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ తనదైన శైలిలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు.రహీం షరీఫ్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి చేరుకోవాలని పలువురు అభినందించారు.



