గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 30
మండలంలోని పందిళ్ళపల్లి పంచాయతీ బాలసముద్రంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు తహసిల్దార్ పార్వతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలను తెలియజేశారు అంటరానితనం ఉండరాదని గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా తాసిల్దార్ పార్వతి అన్నారు దేవాలయాల్లోకి అందరూ సమానంగా వెళ్లాలి అని దళితుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నేత మాదిరాజు ప్రదీప్ రాజు నారాయణ రాజు విఆర్ఓ మల్లికార్జున రెడ్డి గ్రామ సర్పంచ్ గుండ్లూరు కృష్ణమూర్తి పంచాయతీలోని పెద్దలు పాల్గొన్నారు






