
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, అగష్టు31,(గరుడ న్యూస్):
మౌలానా అక్బర్ ఖాన్ సాబ్ ఆధ్వర్యంలో తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్ శనివారం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు,బారిష్టర్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా తూరక కాశలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి వివరించారు.తురక కాశలను ప్రభుత్వాలు గుర్తించడం లేదని, తమను ఆదుకోవాలని కోరారు.తురక కాశ సమస్యల గురించి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… తురక కాశలను తప్పకుండా ఆదుకుంటామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తురక కాశలకై ఎంపీ నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం,రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రంజాన్ సహాబ్,మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షేక్ కరీం,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలానా,తదితరులు,ఉన్నారు.


