
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్1,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీ వద్ద వివేకానంద యువకేంద్రం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు బిరుదరాజు స్రవంతి – శ్రీధర్ రాజు దంపతులు.మరియు నీళ్ల శ్రీధర్ దంపతులు.పూజా కార్యక్రమం అనంతరం తీర్ధ ప్రసాదాలను భక్తులకు పెట్టారు.ఈ వివేకానంద యువకేంద్రం అధ్యక్షులుగా రాపర్తి వెంకటేష్ గౌడ్,ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సూరపల్లి శివాజీ వ్యవహరిస్తున్నారు.కాగా ఈ యొక్క విగ్రహ దాతగా పున్న బలరాం దంపతులు,మండప దాతగా రాపర్తి వెంకటేష్ గౌడ్,దంపతులు నిలిచారు.ఈ కార్యక్రమంలో సురపల్లి వెంకటేశం,వీరమల్ల జంగయ్య,వంగరి రఘు,రాసాల యాదగిరి,భక్తులు, తదితరులు,పాల్గొన్నారు.




