గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 01
ప్రముఖ శక్తి క్షేత్రం చేయకుండా గంగమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో అర్హత లేని వ్యక్తులను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలని కోరుతూ చౌడేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు హరి రాయల్ ఆధ్వర్యంలో పలువురు కూటమి నేతలు బోయకొండ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు వినతి పత్రం అందించారు బోయకొండ గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండల సభ్యులకు ఆగస్టు 7న కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు ప్రభుత్వ నియమ నిబంధనలను ప్రకారం ఎలాంటి కేసులు లేని వ్యక్తులు దేవాదాయశాఖ ఆలయాలకు సంబంధించి ఎలాంటి అక్రమాల్లో కేసులు లేని వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలలో కేసులు లేని వ్యక్తులను దరఖాస్తు చేసుకున్న వారిలో గుర్తించే ఉన్నతాధికారులకు నివేదించాలని వారు కోరారు దరఖాస్తుల పరిశీలనలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మకర్తల మండలికి నియామకం చేపట్టరాదు అన్నారు ఈ మేరకు వారు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్తీక్ మురళీధర్ విద్యాసాగర్ నాయుడు రాఖి పని ఈశ్వర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు



