గరుడ న్యూస్ పుంగనూరు ప్రతినిధి : 01/09/2025

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనకు ఘన నివాళులర్పించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా సోమవారం తెలిపారు. బస్టాండులో గల రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆఫ్షన్‌మెంబర్లు, కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిదులు , పార్టీ అభిమానులు, ప్రతి ఒక్కరు పాల్గొని జననేతకు నివాళులర్పించాలని కోరారు.


