సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,సెప్టెంబర్02,(గరుడ న్యూస్):

చౌటుప్పల మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుప్పల తహసిల్దార్ కార్యాలయం ముందర సోమవారం రోజున మహా ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బూరుగు కృష్ణా రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఎన్నికల ముందు బిజెపి,కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓడ దాటినాక ఓడ మల్లయ్య ఓడదాటగానే బోడ మల్లయ్య,అనే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం,ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టక ఇక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు.రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన,పాలకుల మొద్దు నిద్ర వల్ల సాగు,త్రాగునీరు,విద్య,వైద్యం, విషపూరితమైన కాలుష్యం,భూ సమస్యలు,రహదారులు,డ్రైనేజీ, సిసి రోడ్లు లాంటి సమస్యలు పెన్షన్లు,రేషన్ కార్డులు,ఇండ్లు,ఇండ్ల స్థలాలు, మరుగుదొడ్ల నిర్మాణం,గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,అనేక సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందక ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని అన్నారు.జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు.చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ లో 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని అన్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని సర్వీస్ రోడ్లను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పల్లె మధు కృష్ణ మాట్లాడుతూ స్థానిక పరిశ్రమలలో అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం చౌటుప్పల తహసిల్దార్,కి సమస్యల వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అవ్వరీ రామేశ్వరి,ఆదిమూలం నందీశ్వర్,చింతల సుదర్శన్,తడక మోహన్,బత్తుల దాసు,చీర్క సంజీవరెడ్డి,పొట్ట శ్రీను,భోజ యాదయ్య,బాలరాజు,సప్పిడి శ్రీనివాసరెడ్డి,పర్ని ధర్మారెడ్డి, తూర్పునూరు మల్లేష్,కందగట్ల ఆనంద్,ఆకుల ధర్మయ్య,పల్లె శివ, పుల్లయ్య,చేవ గోనివెంకటేష్,కొండే శ్రీశైలం,శ్రీనివాస్ రెడ్డి,చికూర్ ఈ దయ,తదితరులు,పాల్గొన్నారు.



