

పార్వతీపురం : చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరంని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణంలోని 19 వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్సన్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేసారు. అదికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇళ్లకు వెల్లిన ఎమ్మెల్యే, పెన్షన్ దార్లను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విదంగా పెద్దమొత్తంలో పెన్షన్లు అందచేస్తోందని తెలిపారు. ప్రతీ నెలా ఒకటో తేదీన అధికారులు ఇంటివద్దకే వచ్చి పెన్షన్లు అందించడం దేశంలో మొదటిసారి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వ్రుద్దులు, వికలాంగులు, వితంతువులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని, సమాజంలో ప్రతీఒక్కరు ఎదగాలని నిరంతరం తపన పడుతుంటారని తెలిపారు. కాగా కొందరు పనిగట్టుకొని పెన్సన్లు తొలగిస్తున్నారంటూ చేస్తున్న దుష్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ణప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు



