గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 02
నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని పలువురు వైకాపా నాయకులు అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైకాపా ఆధ్వర్యంలో ఘన నివాళి జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వైకాపా ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ రెడ్డిలు ప్రసంగిస్తూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలు స్వర్ణ యుగాన్ని చూశారన్నారు ఈనాటి 108 చిన్నారులకు గుండె ఆపరేషన్లు వంటివి ఆయన పాలనలోని జరిగాయని ఇప్పటికీ జరుగుతున్నాయని వివరించారు అనంతరం రాష్ట్రంలో ఆయన చేపట్టిన ప్రచారంజక పాలనపై ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దృశ్యకళల అకాడమీ మాజీ సభ్యుడు కూరపర్తి అంజిబాబు రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ మండల మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మండల ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్ సుధాకర్ రెడ్డి నాయకులు రవిచంద్ర రెడ్డి షంషీర్ నున్న భాస్కర అనుప్రియ హరీష్ రాయల్ పవన్ రాయల్ ఓబుల్ రెడ్డి కృష్ణప్ప అల్తాఫ్ భాషా సుబ్రహ్మణ్యం రాజు హరినాథ్ భాగ్య లత అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు



