గరుడ న్యూస్ పుంగనూరు ప్రతినిధి : 03/09/2025

రైతులు పంటలు సాగు చేసేందుకు సరిపడ యూరియాను సరఫరా చేయలేరా అని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి. బుధవారం మండలపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన రైతాంగ సమస్యలను ప్రస్తావించారు. రైతులు పంటలు సాగు చేయాలంటే యూరియా వినియోగం అధికం అని తెలిసిన అధికారులు అందుకు తగినట్టుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని వ్యవసాయశాఖాధికారులను ప్రశ్నించారు. ఖరీఫ్ వ్యవసాయం తగ్గడం, రబికి రైతులు సిద్ధమై పంటలు పెట్టే సమయంలో ఎరువుల కొరత రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై ఏఎంసీ చైర్మన్ శమిపతి మాట్లాడుతూ రైతులకు కావాల్సినంత పరిమాణంలో యూరియా, ఇతర ఎరువులు సరఫరా అయ్యేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని , ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా మండలంలో బోర్లు మరమ్మతులు, పైపులైన్లు, విద్యుత్ సమస్యలు, ఉపాధిహామి పనులపైన పలువురు చర్చించారు. ఈ సమావేశంలో ఏవో రెడ్డెమ్మ, వైస్ సర్పంచ్‌లు ఈశ్వరమ్మ, సరోజమ్మ , కోఆఫ్షన్‌మెంబర్ బాబ్‌జాన్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


