
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్04,(గరుడ న్యూస్)
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వివేకానంద యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విగ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన క్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అన్నదాన దాతలుగా దోనూరి వీరారెడ్డి,వి ఎన్ గౌడ్,రాచకొండ రవి చారి,గోశిక రమేష్ నిర్మల దంపతులు, నర్రా మధుసూదన్ రెడ్డి,యశోద దంపతులు,సురపెల్లి శివాజీ,శాంత దంపతులు, ఉప్పల లింగస్వామి, విజయలక్ష్మి దంపతులు,రాపర్తి సంతోష్,సాగరికి,చెన్నోజు సుధాకర్ చారి,కలిసి అన్నదాన పోషకులుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణపురం ఎస్సై జె జగన్,స్ఫూర్తి కళాశాలల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్,పాల్గొని వారి చేతుల మీదిగా ప్రారంభించారు.ఈ వివేకానంద యువ కేంద్రానికి అధ్యక్షులుగా రాపర్తి వెంకటేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శిగా నర్ర ప్రశాంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు గొల్లూరు యాదగిరి,కోశాధికారి సురపెల్లి వెంకటేష్,ఉన్నారు.నవరాత్రి ఉత్సవాలకు అధ్యక్షులుగా సూరపల్లి శివాజీ వ్యవహరిస్తున్నారు.విఘ్నేశ్వరుని దాతగా పున్న బలరాం నేత,మండపం దాతగా రాపర్తి సురేష్ గౌడ్,లు నిలిచారు.ఈ కార్యక్రమంలో వివేకానంద యువకేంద్రం సీనియర్ సభ్యులు వీరమల్ల జంగయ్య,నీళ్ల శ్రీధర్,కొండ గిరి గౌడ్,శ్రీధర్ రాజు,శ్రీ కంఠమహేశ్వర దేవస్థానం అధ్యక్షులు రాపర్తి కరుణాకర్ గౌడ్,పాశం కృష్ణ,వంగరి రఘుపతి,నీళ్ల నర్సింగ్ గౌడ్,తదితరులు,పాల్గొన్నారు.




