
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,సెప్టెంబర్05,(గరుడ న్యూస్):
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని చౌటుప్పల్ కాంప్లెక్స్ నందు గత 10, పది సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో గోశిక సుమతి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ దీపారాధన అంటే దీప కాంతులతో పావనం చేసి,స్వాగతం పలుకుతూ ధనం,ధాన్యం,దోషాలు లేకుండా నరగోష,లేకుండా ఆ భగవంతుడిని దీపారాధనతో తమ వ్యాపారాల్లో కుటుంబంలో అష్ట,ఐశ్వర్యాలు కలగాలని,దేశం లోని ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్ధన చేయడం అన్నారు.దిపో జ్యోతి:పరం బ్రహ్మ, దీప:సర్వతమో పహా:దీపేన సాధ్యతే సర్వం సందయదీప్ నమోస్తుతి,అని అన్నారు.దీప కాంతి అంధకారాన్ని ప్రాలదోలుతుందని,దీపం అంటే భగవంతుడితో సమానమని అన్నారు. అనంతరం మహిళా భక్తుల చేత మహా నైవేద్యం ప్రసాద వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కాంప్లెక్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బద్దం లింగారెడ్డి,మస్రం యాదగిరి,గోలి యాదగిరి,విష్ణు,మల్లేష్,గోశిక పాండు,గోశిక స్వామి,లక్ష్మయ్య,సత్యనారాయణ,జగన్ రెడ్డి,తదితరులు,పాల్గొన్నారు.




