గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 04
మండలంలోని పలు పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు శెట్టిపేట పంచాయితీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకల చిన్నేపల్లి లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిలో అంచలంచెలుగా ఎదిగి అనేక ఉన్నత పదవులు అలంకరించి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించడం జరిగినది. ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులందరూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించి సమాజంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని కోరడం జరిగినది. మండల ఎస్ టి యు అధ్యక్షులు లింగమూర్తి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలియజేసి, ఉపాధ్యాయ వృత్తికే ఎనలేని కీర్తిని తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు అందరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను ఇవ్వడం జరిగినది.అదే విధంగా విద్యాబుద్ధులు నేర్పుతున్న తమ గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయుల సేవలను కొనియాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గోవింద్ ,విజయశ్రీ, మోహన్, లింగమూర్తి, రామకృష్ణ, మనోహర రాణి, చంద్రశేఖర్, నాగ మునికృష్ణ, విద్యార్థులు పాల్గొనడం జరిగినది




