


గరుడా న్యూస్ ప్రతినిధి తిరుచానూరు: తిరుచానూరు పంచాయతీ పరిధిలో నేతాజీ వీధిలో అయ్యప్ప గణపతి స్వామి నీ శుక్రవారం రాత్రి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. నేతాజీ వీధి గణపతి ప్రతిష్ట అధ్యక్షుడు వాసు మరియు కమిటీ సభ్యులు వినాయకుడు లడ్డు వేలం పాట నిర్వహించినారు. ఈ వేలం పాటలు యువత గ్రామస్తులు పాల్గొన్నారు.. వినాయకుడు లడ్డుని వేలం పాటలో తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి 22 వేల రూపాయలకి వినాయకులడ్డుని దక్కించుకున్నారు. అనంతరం కిషోర్ రెడ్డిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ వీధిలో అయ్యప్ప గణపతిని నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని లడ్డు వేలం పాటలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని వినాయకుడు స్వామి ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించాలని ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి జనసేన రూరల్ అధ్యక్షుడు వెంకీ రాయల్ మరియు సాయి రాయల్ నేతాజీ వీధి గణపతి ప్రత్యక్ష అధ్యక్షుడు వాసు మరియు కమిటీ సభ్యులు కిరణ్ నాగరాజు ముని శంకర్ మురళి ఆనంద్ కిరణ్ శ్రీధర్ బాలాజీ సాయికుమార్ ముని కుమార్ గ్రామ ప్రజలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.



