సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్06,(గరుడ న్యూస్):

సరళ మైసమ్మ దేవాలయం వద్ద గురుపూజోత్సవం ఘనంగా చేశారు.ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ముఖ్య అతిథిగా వచ్చారు.గురుపూజోత్సవ సందర్భంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.మాజీ చైర్మన్ రాజు మాట్లాడుతూ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తిని రాష్ట్రపతి వరకు ఎదిగారు అలాగే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది సమాజంలోని డాక్టర్లని లాయర్లని అధికారులని అందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు.అలాగే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆదేశంలో ఉపాధ్యాయులు పాత్ర ఎంత ఉంటుందని అన్నారు.అలాగే సరళ మైసమ్మ దేవాలయం ఆవరణలో ఆవరణలో గురువుల వారిని సన్మానించాము నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల,చైర్మన్ కే వి బి కృష్ణారావు,పంతంగి మాజీ సర్పంచ్ సత్యం,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.



