సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్07,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సెప్టెంబర్ 07,వ తారీకు,ఆదివారం ఈరోజు ఉచిత మైగా వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సౌజన్యంతో ఎమ్మెల్యే తల్లి అయినటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్, ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన తలపెట్టిన ఉచిత మెగా వైద్య శిబిరాల వలన ఎంతోమంది పేద ప్రజలకు కంటి సమస్యలు తొలగుతున్నాయని,అవసరమైన వారికి కళ్ళ అద్దాలు,కంటి ఆపరేషన్లు చేయించి నియోజకవర్గం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల నుండి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.



