గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 07
వైకాపాను బలోపేతం చేయాలంటే మన సెల్ ఫోన్ ని మనం వెపన్ లా వాడాలి :వజ్ర భాస్కర్ రెడ్డి
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం వైయస్ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందామని వైకాపా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు .
ఈ మేరకు మండల స్థాయిలో గడ్డం వారి పల్లి రోడ్డు లోని బైసాని కళ్యాణమండపంలో వైసిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలోనూ వైకాపా కు ప్రాతినిధ్యం వహించేలా నియమించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు
యువకుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరిని కమిటీలో భాగస్వాములుగా చేసి వారి ద్వారా రాబోయే కాలంలో వైకాపా ఎలాంటి ఎన్నికలకు వెళ్లిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు
దీంతో రాష్ట్రంలోనే పుంగునూరును ఆదర్శవంతంగా తీసుకోవాలనే ఉద్దేశం వైకాపా అధిష్టానం భావిస్తుందన్నారు
ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో పనిచేసి వైకాపాకు ఎదురుగా నిలచే ఏ పార్టీకైనా డిపాజిట్లు గల్లంతు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు
ఈ మేరకు అన్ని విధాల పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు
గతంలో పనిచేసిన వాలంటీర్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధింపబడిన అందరిని కమిటీల్లోకి చేర్చుకొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నారు
అందరం కలిసి సోషియల్ వింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాలు 30 సెకండ్స్ లో చేరవేసుకుంటూ పార్టీని మరింత పటిష్టం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు
ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి వైకాపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు
ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ, రాష్ట్ర వైకాపా నాయకులు మిద్దింటి కిషోర్, కళ్యాణ్ భరత్, చౌడేపల్లి మండల ఇన్చార్జి చంగారెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు, కూరపర్తి అంజిబాబు, రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, అనుప్రియ, భాస్కర, హరీష్ రాయల్, పవన్ రాయల్, సుబ్రమణ్యం రాజు, రవి చంద్రారెడ్డి, షంషీర్ భాష, శ్రీరాములు, రాంబాణం శ్రీనివాసులు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




