( గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి ) చందగ్రహణం కారణంగా పలు ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి ఆలయాన్ని సోమవారం మధ్యాహ్నం శుద్ధిచేసి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అలాగే శ్రీ బోగనంజుండేశ్వరస్వామి, గూడూరుపల్లె వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీచాముండేశ్వరి ఆలయం, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీసోమేశ్వరస్వామి ఆలయం, శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయం, మారెమ్మ ఆలయాలు, శ్రీషిరిడిసాయిబాబా ఆలయాలను మూసివేశారు. భక్తులు గమనించాలని సంబంధిత ఆలయ నిర్వాహకులు కోరారు.



