
గరుడ న్యూస్ ప్రతినిధి: తిరుచానూరు
చంద్రగ్రహణం కారణంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకి మూసివేశారు. ఆదివారం ఉదయం అమ్మవారి పవిత్రోత్సవాలను మహా పూర్ణహుతితో ముగించి పూజా కార్యక్రమాలను నిర్వహించినారు. అనంతరం ఒక గంట 30 నిమిషాలకు ఏకాంత సేవ నిర్వహించి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి అమ్మవారి ఆలయాన్ని శుద్ధిచేసి పుణ్యా వచనం చేస్తారు అనంతరం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ సూపర్డెంట్ రమేష్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బరాయుడు ఆగమ సలహాదారులు మణికంఠ భట్టాచార్యులు అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.





