

గరుడ న్యూస్ ప్రతినిధి రాజేష్: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ కార్యక్రమం. ఈ గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారు, మున్సిపల్ కమిషనర్ మౌర్య గారు , తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు , రాష్ట్ర బ్యూటిఫుల్ & గ్రీనరీ చైర్మన్ సుగుణమ్మ రాష్ట్ర హస్తకళా చైర్మన్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి మునికృష్ణ గారు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.వి ఎన్ కుమార్, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారు, తదితరులు హాజరయ్యారు. గురుపూజోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని.



