
డంపింగ్ యార్డ్ లో ఉన్న వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ సంస్థకు అనుమతులు జారీ
సోమవారం నుంచే పనులు ప్రారంభం
విలేకరుల సమావేశంలో తెలియజేసిన తెలుగుదేశం పట్టణ కార్యవర్గం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల రాయగడ రోడ్డు శివారు గల డంపింగ్ యార్డ్ తరలించేందుకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చొరవ తీసుకున్నారని తెలుగు దేశం పార్టీ కార్యవర్గం అన్నారు. డంపింగ్ యార్డ్ ను తరుణి అసోసియేట్స్ కంపెనీ వాళ్లతో తెలుగుదేశం కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో ఉన్న వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ కి వర్క్ పర్మిట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. నేటి ( సోమవారం) నుంచే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో అతి కీలక సమస్య అయిన పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో గల డంపింగ్ యార్డ్ క్లీనింగ్ అండ్ రీసైక్లింగ్ ప్రాసెస్ అని, అది నేటికి నెరవేరిందని అన్నారు. శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర ఆదేశాల ప్రకారం ఇదివరకే ఒప్పందం చేసుకున్న తరుణి అసోసియేట్స్ బృందంతో పాటు మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఇతర వార్డుల కీలక నాయకులు ఆ ప్రదేశాన్ని ఏజెన్సీ బృందంతో పర్యవేక్షించడం జరిగినదని అన్నారు. గత ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలలో మన గత ప్రజాప్రతినిధులు ప్రవేశపెట్టిన అంశాలు గత ప్రభుత్వపాలనా సమయంలో నెరవేరక, ఈనాటికి పరిష్కారానికి నోచుకుంటున్నందుకు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛాంద్ర మిషన్ తో పాటు భాగస్వామ్యమైన తరుణి అసోసియేట్స్ సిబ్బంది ఈ ప్రక్రియ గూర్చి తెలిపిన వివరాల ప్రకారం , ఇప్పటివరకు కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సుమారు 20వేల టన్నులకు మించిన వ్యర్థాలను, పర్యావరణ సురక్షిత విధానాల్లో , ప్రాసెసింగ్ చేసి ప్లాస్టిక్, RDL , స్టోన్, పేపర్ వేస్ట్, మెటల్, గ్లాస్ వ్యర్ధాలను వేరు చేసి వాటిని రీసైక్లింగ్ పద్ధతిలో ఉపయోగపడే విధముగా ముడిసరుకుగా ఆయా సంబంధిత పరిశ్రమలకు పంపించడం జరుగుతుందని అన్నారు. తద్వారా ఇక్కడ కీలక సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ కు సుమారు 3 నెలలలో పరిష్కారం రానుండడం పార్వతీపురం పట్టణ అభివృద్ధికి, శాసన సభ్యులు చేసిన కృషికి , కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన చేస్తున్న పురోగతికి నిదర్శనం అని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన సదస్సులో ఒడిస్సా ముఖ్యమంత్రితో జంఝావతి సమస్యపై ఎమ్మెల్యే చర్చించారని అన్నారు. పార్వతిపురం మన్యం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుకు ఎమ్మెల్యే కృషి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, పట్టణ కార్యదర్శి మజ్జి సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బెలగాం, బార్నాల సీతారాం, జయప్రకాష్ ,కౌన్సిల్ సభ్యులు టి. వెంకటరావు, ఎం.రవికుమార్, బడే గౌర్నాయుడు,కోరాడ నారాయణ రావు, సీనియర్ నాయకులు డాక్టర్ గరిమెళ్ళ భాను ప్రసాద్, కోలా మధుసూదనరావు, సారికగణేష్, భాష, పారినాయుడు, పాలకొండ రాజశేఖర్, బలగ మధుసూదనరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



