
ఫిర్యాదుదారులు సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి, సమస్యలను వివరించి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘”ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)” కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్.
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం,ప్రేమ పేరుతో మోసం,ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని,తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపవలెనని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం* 12* ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటుగా డిసిఆర్బీ సిఐ ఆదాం మరియు సిబ్బంది పాల్గొన్నారు.



