తిరుపతిలో జరిగే కార్యనిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం 

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 10

తిరుపతిలో జరిగే కార్యనిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం  పెన్ను  ఓబులేసు పిలుపునిచ్చారు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం  లో వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెన్ను ఓబులేసు పత్రిక విలేకరుల సమావేశంలో  తిరుపతిలో ఈనెల 11న జరగబోయే ఎస్సీ సెల్ కార్య నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులేసు పిలుపునిచ్చారు బుధవారం స్థానికంగా ఆయన  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాలు ఊపొందుకున్నాయన్నారు అంతేకాకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఎస్సీ లపై దౌర్జన్యాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు వీటన్నింటి పరిష్కారం కోసం ఈనెల 10న తిరుపతిలో జరిగే సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ లందరూ తప్పక హాజరు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ పుంగునూరు నియోజకవర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి బ్యాంకు రెడ్డప్ప మండల అధ్యక్షుడు గోవిందయ్య వైకాపా నాయకులు చౌడేపల్లి సర్పంచ్ శ్రీరామ్ భరత్ వరుణ్ నాయకులు పవన్ రాయల్ గిరి తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *