గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 10
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగు పల్లి గ్రామపంచాయతీ శక్తి స్వరూపిణి లోకమాత బోయకొండ గంగమ్మ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు ఈ క్రమంలో ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం అర్చకులతో కలిసి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డిలకు ఆహ్వానం పలికారు అనంతరం పోస్టర్లను విడుదల చేశారు దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు వారికి సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయ ప్రధాన అర్చకుడు గంగిరెడ్డి అర్చకులు సుధాకర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు



