గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 14
యూనియన్ గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్
బోయకొండ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వాలని బోయకొండ గంగమ్మ దేవస్థానం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బోయకొండలో ఆయన మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. అతి తక్కువ వేతనాలు తీసుకునే వారికి నెలనెల 5వ తేదీ లోపు వేతనాలు ఇవ్వకపోతే వేతనాల మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు రకరకాల కుంటి సాకులు పేరుతో వేతనాలు ఆలస్యం చేయడం సరికాదన్నారు. ఆదివారం బోయకొండ రద్దీగా ఉంటుందని ఆ సమయంలో కార్మికులపై భక్తులు దౌర్జన్యాలు చేస్తున్నారని కార్మికులకు రక్షణగా అధికారులు నిలబడాలని తెలిపారు. ఇప్పటికైనా బొయకొండ కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వక పోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



