కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సెప్టెంబర్14,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాయిల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిట్టు సత్యనారాయణ మాతృమూర్తి బిట్టు అండాలు పరమపదించారు.ఈ విషయం తెలుసుకొని వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి… ఆమె అకాల మరణం పట్ల చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.


