సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,వాచ్యతండా,సెప్టెంబర్16,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతాండ గ్రామపంచాయతీ లో వాంకుడోతు రత్తు నాయక్,(రేషన్ డీలర్) ప్రథమ వర్ధంతి సందర్భంగా వాచ్యతాండ లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వారి కుటుంబ సభ్యులకు సమక్షంలో విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కుమారులు వాంకుడోతు బన్సీలాల్, (పిడి హౌసింగ్ ఆఫీసర్)మంచిర్యాల జిల్ల వాంకుడోతు రాజు,వాచ్యతాండ గ్రామస్తులు,తదితరులు,పాల్గొన్నారు.
