సాలూరు, సెప్టెంబర్ 17,గరుడ న్యూస్ ప్రతినిధి:నాగార్జున
ఏపీజే అబ్దుల్ కలాం,మదర్ తెరిసా,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,నందమూరి తారక రామారావు జాతీయ రత్న అవార్డులను ప్రధానోత్సవం…
దాసరి నారాయణ రావు కల్చలర్ అకాడమీ 37 వ వర్షకోత్సవం విశాఖపట్నం డాబా గార్డెన్ లో ఉన్న అల్లూరి సీతరామరాజు విజ్ఞాన వేదిక వద్ద ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ వర్షకోత్సవం సందర్బంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు స్వచ్ఛంద సంస్థ సభ్యులను గౌరవంగా సన్మానించారు. ఇందులో భాగంగా సాలూరు కు చెందిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్&శ్రీ గౌరమ్మ చారిట్రబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ లో 8 సంవత్సరాలుగా ఏకధాటిగా సేవలు అందుస్తున్న సాలూరు నియోజవర్గానికి చెందిన యడ్ల మహేష్,గౌడ్ ఈశ్వరరావు,పంచాది శ్రీనివాసరావు,మద్దుల భార్గవ్,పసుమర్తి నరేష్, కుందుల వసంత కుమార్, వంక మనోజ్ కుమార్,బోర్ర కృష్ణవేణి,పి బి ఎస్ చంద్రశేఖర్,తెలగం శెట్టి అనిల్ కుమార్,సభ్యులకు ఘనంగా,గౌరవంగా సీల్డ్ శాలువాతో సన్మానించారు. అవార్డు అందుకున్న వారికి సంస్థ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్,సంస్థ సభ్యులు,సాలూరు ప్రజలు, అధికారులు,నాయకులు అభినందనలు తెలిపారు.



