సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,కొర్ర తండా,సెప్టెంబర్17,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కోర్ర తండాలో భారత దేశపు ప్రజా ధారణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కొర్ర తండా 129 భూత్ అధ్యక్షుడు కొర్ర శోబన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో కేక్ కట్ చేసి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత దేశం అగ్రగామిగా నిలిచింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ వలన తెలియజేశారు.ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల కార్యవర్గ సభ్యుడు కరంటోతు రమేష్ నాయక్,కొర్ర సురేందర్ నాయక్,సోషల్ మీడియా కన్వీనర్ కొర్ర జైల్ సింగ్ నాయక్,కొర్ర గణేష్,కొర్ర శివాజీ,కొర్ర రాజేష్,కొర్ర శంకర్,హీరా,కొర్ర పరమేష్,తండా వాస్తవ్యులు,తదితరులు,పాల్గొన్నారు.




