గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి.ఈనెల 24వ తేదీ విజయవాడలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత రణభేరి సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వసంతపల్లి సురేష్ పిలుపునిచ్చారు బుధవారం నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద దళిత రణభేరి పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 వ తేదీ విజయవాడ లో ధర్నా చౌక్ వద్ద నిర్వహిం చనున్న దళిత రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చిన దళితుల వారి హక్కులను కాల రాస్తున్నారని, రాజ్యాధికారం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చునని అంబేద్కర్ ఆనాడే తెలిపారని అందుకోసం అందరూ సహకారంతో కృషి చేద్దామన్నారు .ఈ కార్యక్రమం లో బి ఎస్ పి నాయకులు అధ్యక్షులు అద్దిగాల అంజప్ప బాలసుబ్రమణ్యం నాగరాజు కృష్ణ నాగప్ప రామకృష్ణ దళిత నాయకులు మునెప్పన్న పాల్గొన్నారు.



