గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 18
ఈనెల 19న జరగబోవు చలో మెడికల్ కళాశాలలు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైసిపి రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ అన్నారు. గురువారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ,
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఆదేశాల మేరకు అదేవిధంగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, సూచనతో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి లో నిర్వహించబడునన్నారు.
కావున విద్యార్థి, యువజన విభాగ నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.



