గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 18
పోషణ మాస ఉత్సవాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 16 వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలు జరుగుతున్నాయని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. ఈ మాసోత్సవాల సందర్భంగా చౌడేపల్లి 3 అంగన్వాడి సెంటర్ నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లల లో అనీమియా, లోప పోషణ నివారించవచ్చు. గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందువలన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందన్నారు చిన్న పిల్లలలో లోప పోషణ నివారించవచ్చు అని తెలిపారు. అనంతరం పోషక విలువలను గురించి వివరించారు.
ఈ కార్య క్రమంలో ఏసీ డిపిఓ సుజాత, సూపర్వైజర్స్ సులోచన, రాధ, అంగన్వాడి కార్యకర్తలు, గర్భవతులు బాలింతలు 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లల తల్లులు పాల్గొన్నారు.




