సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,సెప్టెంబర్20,(గరుడ న్యూస్):

చౌటుప్పల్ మండల పరిధి మండలం దేవలమ్మ నాగారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్,ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆప్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ట్రెజరీ సిలువేరు మంగయ్య తన సొంత గ్రామానికి సేవ చేయాలన్న దాతృత్వంతో విద్యార్థులకు టైలు,బెల్టులు చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్,ఎస్ఐ ఉపేందర్ రెడ్డి,చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సిఐ జి.మన్మధ కుమార్,ఎస్సై ఉపేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.సందర్భంగా సిఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ నేను కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే మీలాగానే కింద కూర్చొని చదువుకున్నానని,మాకు ఆ కాలంలో సరి అయిన స్కూల్ డ్రెస్సులు కానీ చెప్పులు కానీ ఉండేవి కావని తెలిపారు.పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు.ఈ గ్రామ నివాసి,ఇదే పాఠశాలలో చదువుకున్న సిలువేరు మంగయ్య ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించాలని మీకు టై,బెల్టులు బహకరించడం చాలా అభినందనీయం అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులని,నవ సమాజ స్థాపనకు చేయూతనియాలని అన్నారు.అలాగే దాత సిలివేరు మంగయ్య ను అభినందించి,సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తిరందాస్ జగన్,ఎంఈఓ గురువారావు,మాజీ సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి నరసింహారెడ్డి,మహమ్మద్ పాషా,వెంకటేశం,వేముల నరసింహ,రాజు చారి,చింతల ప్రభాకర్ రెడ్డి,సిలివేరు శివ,తదితరులు,పాల్గొన్నారు.



