గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 22
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి సోమవారం మండలంలోని పలు గ్రామాలు పర్యటన చేశారు. పెద్దలకుంట్ల గ్రామపంచాయతీలో గల మణుకూరమ్మ అమ్మవారిని ఆయన దర్శించారు .అమ్మవారి గుడి వద్దకు చిప్పిలి వారి పల్లె నుంచి, రోడ్డు సౌకర్యం కావాలని ప్రజలు నుంచి వినతి అందుకుని వెంటనే సంబంధిత అధికారికి సమస్యను తెలిపి రోడ్డును మంజూరు చేసే విధంగా తన వంతు కృషి చేస్తారని ఆయన వారికి వివరించారు . ఈ క్రమంలో ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపి పూలమాల వేసి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బోయకొండ సుబ్బు,ఆవుల పవన్, అర్జున్ రాయల్, గిరినాయుడు, కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



