గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 22
పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చౌడేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై ఆరా తీశారు. అర్జీదారులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వెయ్యాలని, సూచించారు, అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని తహసిల్దార్ పార్వతి, దృష్టికి తీసుకెళ్లారు . మండల తహసిల్దార్ భవనం చుట్టుపక్కల తిరుగుతున్న రైతులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలపై వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని వారికి హామీ ఇచ్చారు. అర్జీదారులు వారి సమస్య పరిష్కార దిశగా వెళ్లడంతో కొంతమంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అతని వెంట బోయకొండ సుబ్బు కుమార్ రెడ్డి ,ఆవుల పవన్, అర్జున్, ప్రభాకర్ ,చంగల్ రాయుడు, గిరి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.






