సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,సెప్టెంబర్24,(గరుడ న్యూస్)
దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ సిఐ మన్మధ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు.దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు,విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారని అన్నారు.అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యతగా తెలిపి ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా ఓ ప్రకటన విడుదల చేశారు.సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం తెలియజేయాలి.మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం,సెక్యూరిటీ అలారం,మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది.తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు,వెండి,ఆభరణాలు,డబ్బులు,బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి అని తెలియజేశారు.ఇందులో భాగంగా ఇంటిముందు,వీధుల్లో,సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండి దసరా పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని తెలియజేశారు.



