సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సెప్టెంబర్24,(గరుడ న్యూస్):

మునుగోడు మండల పరిధిలోని ఉకొండి గ్రామానికి చెందిన మేడి యాదగిరి,ప్రమాదవశాత్తు చనిపోయాడు.ఈ విషయాన్ని తెలుసుకొని ఈ ఎల్ వి,భాస్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇరుగుదిండ్ల ఆశోక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక పరిస్థితి బాలేదని తెలుసుకొని వారికి 10000/- పది రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ క్వింటాల్ బియ్యం అందించారు.అదేవిధంగా మరొక పేద కుటుబం మునుగోడులో మృతురాలు మెట్టు మారమ్మ,కుటుంబన్నీ పరామర్శించి 50 కిలోల బియ్యం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో ఎక్కడ ఏ పేదవానికి ఇబ్బంది జరిగిన అక్కడ ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి ఫౌండేషన్ సభ్యులు బండమీది కిరణ్ కుమార్,పుల్కరం సైదులు,దుబ్బ అనిల్,ఏర్పుల స్వామి,బాలకృష్ణ,నాతి లింగస్వామి,అభి, తదితరులు,పాల్గొన్నారు



