
సాలూరు,సెప్టెంబర్ 26, గరుడ న్యూస్ ప్రతినిధి: నాగార్జున
రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ సెప్టెంబర్ 28 ఆదివారం నాడు శ్రీ శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ మండపం,సాలూరు లో స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్,రాజు గురు,సుగుదేవ్ ల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రూప్ సభ్యులు తెలిపారు.ఈ రక్త సేకరణ అనేది తల సేమియా,పిల్లలకు,సికిల్ సేమియా,డయేరియా వ్యాధిగ్రస్తులు కాకుండా క్యాన్సర్,గర్భిణీ స్త్రీలకు మరియు అప్పటికప్పుడే రోడ్డుపై స్తంభం ఇంచే ప్రమాదాలకు,అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ రక్తనిధి సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున రక్తదానం పై అవగాహన చేసుకుని స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారి ప్రాణాలు కాపాడే వారు అవుతాము అని సంస్థ సభ్యులు తెలియజేశారు.ఈకార్యక్రమంలో బెవర గణపతి,గౌడు ఈశ్వరరావు,వంక మనోజ్,పసుమర్తి నరేష్, పంచాది శ్రీనివాసరావు.
రక్తదానం చేసేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:9966093418


