సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్26,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్బనగోని ముఖేష్,అకాల మరణం చెందారు,ఈ విషయం తెలుసుకున్న సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖేష్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి వారి యొక్క కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి 5000/– ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.



