వృత్తి విద్యపై మహబూబాబాద్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల హెల్త్ కేర్ విద్యార్థులకు దసరా సెలవుల్లో ఇంటర్ను షిప్….!!

Srinivas Nayak
1 Min Read

వృత్తి విద్యపై మహబూబాబాద్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల హెల్త్ కేర్ విద్యార్థులకు దసరా సెలవుల్లో ఇంటర్ను షిప్….!!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు…

మహబూబాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 (గరుడ న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల దసరా సెలవుల్లో భాగంగా వృత్తి విద్యపై ఇంటర్ను షిప్ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు వృత్తి విద్యపై పది రోజులపాటు ఇంటర్ను షిప్ కార్యక్రమాన్ని 22-09- 2025 సోమవారం రోజున ప్రారంభించారు. చదివిన దానికంటే చూసి నేర్చుకోవడం వల్లే అధిక జ్ఞానాన్ని పొందవచ్చు అని అంటున్నారు. పాఠశాల రోజులతో పాటు, సెలవు దినాల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా వారిలో నైపుణ్యత మరింత పెంపొందించే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంబాలపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు 10 రోజులపాటు వృత్యాంతర శిక్షణ అందించి శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రిన్సిపాల్ జి .ఉపేందర్ రావు ఆరవ రోజు ఇంటర్ను షిప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంబలపల్లి సందర్శించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ విద్యార్థులు సెలవుల్లోని సమయాన్ని శిక్షణ కోసం కేటాయించాలని సద్వినియోగం చేసుకొని విద్యలో ఉన్నంతగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాగర్ మరియు వైద్య సిబ్బంది, ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఒకేషనల్ టీచర్ కే నలిని కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *