సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,జనగాం,సెప్టెంబర్27,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని జనగాం గ్రామానికి చెందిన ఓర్సు దశరథ,ఇటీవల దురదృష్టవశాత్తు మరణించారు.ఈ విషయం తెలుసుకున్న ఈ ఎల్ వి ఫౌండేషన్ భాస్కర్ వారి కుటుంబ సభ్యులు తండ్రి మీనయ్య,మృతుని భార్య శైలజ,లను శుక్రవారం నాడు పరామర్శించి మనోధైర్యాన్ని నింపి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అదే విధంగా మృతుని కుమార్తె గంగోత్రి భవిష్యత్తులో ఆమె యొక్క ఉన్నత చదువులకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,ఈ ఎల్ వి ఫౌండేషన్ అశోక్,శంకర్,కిరణ్,సునీల్, సాయికిరణ్,సభ్యులు,గ్రామస్తులు,తదితరులు,కుటుంబ సభ్యులు,పాల్గొన్నారు.



