
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్ 27,(గరుడ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో నిర్వహించిన గూడూరు విజయమ్మ దశదిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు.మరణించిన విజయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాసమల్ల యాదయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు సిలివేరు నరసింహ్మ,చెక్క నరసింహ,బోయిని నరసింహ, బైకని నరేందర్ యాదవ్,యాదయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ మండల శాఖ అందె నరేష్,చింతల లింగస్వామి,ఏపూరి శివయ్య,తదితరులు, కుటుంబ సభ్యులు,పాల్గొన్నారు.



