గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 27
చౌడేపల్లి ఆరోగ్య కేంద్రంలో శనివారం సస్త్ నారి శసక్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి కౌన్సిల్ సభ్యురాలు మల్లికా,వైద్యాధికారిని మోనా, సింగిల్ విండో అధ్యక్షుడు హరి రాయల్, ప్రసంగిస్తూ సమాజంలో మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం అదే స్థాయిలో ఉంటుందని ముఖ్యంగా మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వారిలో రక్తహీనత మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల ప్రమాదంగా ఉండాలన్నారు.క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేయిస్తే నయం అవుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం మహిళలకు పలు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య, కార్తీక్, బిజెపి మండలాధ్యక్షుడు మనోహర్, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, ఏసీడీపీఓ సుజాత సూపర్వైజర్లు రాధా సులోచన, ఏఎన్ఎమ్ లు ఆశలు అంగన్వాడి కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.




