గారుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 27
ప్రముఖ పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజున అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషాలు పూజల అనంతరం శాకాంబరి దేవి అలంకారము చేశారు.వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. తిరుపతికి చెందిన వేణుగోపాల్ రెడ్డి, సుగుణ,చౌడేపల్లి మాజీ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి ప్రకాష్, పద్మావతి,శ్రీనివాసులు, సుమలత,శబరిస్ గ్యాస్ ఏజెన్సీస్ అధినేత మోహన్ బాబు, పద్మజ,తిరుపతి జ్యోతి, పుంగనూరు మహేంద్ర,రాధాదేవి, లు శాఖాంబరి అలంకారానికి ఉభయ దారులుగా వ్యవహరించారు. ఉబయదారులను చండీ గణపతి హోమాలలో భాగస్వాములు చేశారు.ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం వారికి అమ్మవారి ప్రతిమ పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ అధికార అర్చక సిబ్బంది సేవలందించారు.



