సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,సెప్టెంబర్28,(గరుడ న్యూస్):

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ నాయకులు తొర్పునూరి లింగస్వామి పుట్టినరోజు కార్యక్రమం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లింగస్వామి తో కేక్ కట్ చేయించి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని లింగస్వామినకి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్ కమిటీ చైర్మన్ పాశం సంజయ్ బాబు,జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్,కైతాపురం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు,యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ మండలం ఉపాధ్యక్షులు గట్టు సాయి సుందర్,ఎలమోని శ్రీకాంత్,సుర్వి మహేష్ గౌడ్,తదితరులు,పాల్గొన్నారు.



