రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,కొత్తగూడెం,సెప్టెంబర్28,(గరుడ న్యూస్):
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షులు ఘనం అంజయ్య పేర్కొన్నారు.కొత్తగూడెం గ్రామపంచాయతీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సమాజంలో అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి బాపూజీ అని కొనియాడారు.తొలి దశ మలిదశ తెలంగాణ పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ జంగయ్య,మాజీ గ్రామ శాఖ రాచకొండ శ్రీనివాస్,బాలగోని పద్మయ్య,కొమ్ము మల్లేష్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి బీరయ్య,కోడూరు నరసింహ,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలగోని మల్లేష్,చెరుకుపల్లి నరసింహ,ఆశా వర్కర్ నాగమణి,విలేజ్ సెక్రటరీ సంతోష్,మాజి ఉప సర్పంచ్ రాచకొండ లింగస్వామి,బాలగోని రవి గౌడ్,అనంతల రాములు,రాచకొండ యాదయ్య,కోడూరు రాములు,తదితరులు, పాల్గొన్నారు.



