సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సెప్టెంబర్ 29(గరుడ న్యూస్):

సామాజిక సేవా కార్యక్రమాలు బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఉద్యమ నేత సంఘంలో విశేషంగా కృషి చేస్తూ,దూసుకు పోతున్న,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి,గనం నర్సింహ్మ కురుమ,కి తెలుగు భాషా సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ గుర్తించి(మహానంది)అవార్డు,జాతీయ పురస్కార సన్మాన పత్రం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా అందజేయడం అందజేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కురుమ గూడెం గ్రామానికి చెందిన ఘనం నరసింహ కురుమ,గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ తరుణంలో బీసీ సంక్షేమ శాఖ సంఘం పెద్దలు గుర్తించి బీసీ సంక్షేమ రాష్ట్ర సంఘంలోకి ఆహ్వానించి కొన్ని బాధ్యతలుని అందించారు.అట్టి బాధ్యతలను బాధ్యతాయుతంగా చూసుకుంటూ,ఎంతో మందికి తన సాయశక్తులతో పేదవారికి సహాయం చేస్తూ,విద్యారంగంలో వెనుకబడిన పేద విద్యార్దులకు,ఇతర సమస్యలతో ఉన్నవారికి తన వంతు శక్తివంతన లేకుండా సహృదయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపారు.ఇట్టి సేవా కార్యక్రమాలను చేస్తున్న గణం నరసింహ కురుమను గుర్తించి తెలుగు భాష సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ వారు గతంలో కూడా సన్మానం చేశారు.ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ అవార్డుతో సేవా కార్యక్రమాలు చేయడంలో మాపై మరింత బాధ్యత పెరిగిందని ముందు ముందు అనేక కార్యక్రమాలు నా శక్తిమేర సేవా కార్యక్రమాలు,ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందు ఉంటానని అన్నారు.



